Thursday, 06 August 2026 02:50:52 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ₹50 కోట్లు కేటాయింపు.

ఉషన్న పల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ.32 లక్షలతో నిర్మించిన భవనం, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం *ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించడమే కాంగ్రెస్ లక్ష్యం * ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 August 2026 04:32 PM Views : 91

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ ఆగస్టు 05 అక్షరం న్యూస్ కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గంగారం, ఉషన్నపల్లి గ్రామాల్లో బుధవారం రోజున ప్రభుత్వ విప్. విస్తృతంగా పర్యటించిన తదుపరి ఉషన్నపల్లి గ్రామంలో ₹10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ₹32 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే. చింతకుంట విజయరమణ రావు ​ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ... ఒకప్పుడు సరైన భవనం లేక, కేవలం 20 మంది విద్యార్థులతో ఉన్న ఉషన్నపల్లి పాఠశాల, నేడు ఉపాధ్యాయులు మరియు ప్రజాప్రతినిధుల కృషి వల్ల 56 మంది విద్యార్థులతో కళకళలాడుతుండటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 75కి పెంచాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు హెడ్మాస్టర్ సమ్మయ్య, మండల విద్యాధికారి మరియు గ్రామ సర్పంచ్ చొరవతో 'సోలార్ విద్యుత్ ప్లాంట్' ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ వాడకం పోను మిగిలిన డబ్బులు నేరుగా పాఠశాల ఖాతాలోనే జమవుతాయని తెలిపారు. ​గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు నియోజకవర్గంలో విద్యా రంగానికి ఇప్పటివరకు ₹50 కోట్ల పైచిలుకు ఖర్చు చేశామని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత 10 ఏళ్లలో స్కూల్ భవనాలకు కోటి రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం రెండేళ్లన్నర కాలంలోనే కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్కూల్ భవనాలు, కాంపౌండ్ వాల్స్ కోసం ₹5 నుండి ₹6 కోట్లు, కస్తూరిబా పాఠశాల (KGBV) విస్తరణకు ₹2.5 కోట్లు మంజూరు చేశామని వివరించారు. అలాగే ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దసరా నాటికి అల్పాహారం (టిఫిన్) అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ​ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గంగారం టర్నింగ్ మెయిన్ రోడ్డు నుండి ఉషన్నపల్లి గ్రామం నుంచి పందిళ్ల చౌరస్తా వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే శ్రీరాంపూర్ R&B రోడ్డు నుండి ఉషన్నపల్లి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. ​ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యా అర్హతలు కలిగిన మెరిట్ ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంఈఓ మహేష్, ఎంపీడీవో సురేందర్, మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :