AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : * * పెద్దపల్లి/ అక్షరం ప్రతినిధి (మే 16) పెద్దపల్లి జిల్లా కేంద్రంలొని వ్యవసాయ మార్కెట్ వరి ధాన్యం మరియు మక్కలు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... వేసవికాలం ఎండ అధికంగా ఉందని దీంతో పాటు హమాలి కొరత కూడా కొంత ఉందని అన్నారు. ఐకెపి, సింగల్ విండోస్ సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని ఈ వేసవిలో నాలుగున్నర మెట్రిక్ టన్నుల వరి పండినట్లు సివిల్ సప్లై అధికారులు లెక్కలు చెబుతున్నారని అధిక ఎండా కారణంగా మిల్లులో దిగుమతికి కొంత సమయం పడుతుందని అన్నారు. మే 25వ తేదీ వరకు మూడున్నర లక్షల టన్నుల వరి ధాన్యం కొనాలని ప్రభుత్వం ,జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు కూడా దృష్టి పెట్టి పనిచేయడం జరుగుతుంది అన్నారు. ఈ నియోజకవర్గంలో మొక్క జొన్నలు కూడా 11 సెంటర్లో రైతులను తీసుకోవడం జరుగుతుందని, మొక్కజొన్న రైతులు కూడా అధైర్య పడవద్దని ఒక గింజ లేకుండా జొన్నలు కొనడం జరుగుతుంది అన్నారు. మొక్క జొన్న రైతులు గన్ని సంచులు కొనుక్కుంటే ప్రభుత్వం గన్ని సంచుల ఒక్కొక్కరికి 21 రూపాయిలు ఆ తదుపరి ఇస్తుందని సెంటర్ ఇంచార్జ్ నిర్వహణ ఖాతాలో వేస్తుందని గన్నీ సంచులు కొనుక్కున్న రైతులకు ఇస్తారు అన్నారు. ప్రభుత్వం మొక్కజొన్నలకు రూపాయలు 2400 మద్దతు ధర ఇస్తుంది అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాధాంతాలు రైతులు నమ్మవద్దు అన్నారు. చుట్టుప్రక్కల వరి ధాన్యం కటింగు ఉందని మన నియోజకవర్గంలో లేకపోవడంతో ప్రతిపక్షాలు ఏదోరకంగా ఎన్ని రాజకీయ కుట్రలు చేసిన రైతులు పట్టించుకోకూడదు అన్నారు. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో రైతులు కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కటింగు తో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసని, ప్రస్తుతం వరి ధాన్యం కటింగ్ లేకపోవడం వలన ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు అన్నారు. ప్రస్తుతం 60 శాతం వరకు వరి ధాన్యం అమ్మడం జరిగిందని మరో 40 శాతం 15 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. అనుకోకుండా వర్షం వస్తే రైతులు మక్కలు తడవకుండా జాగ్రత్త పడాలని, మక్కలు కొనుగోలు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు పలు గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily