Wednesday, 04 March 2026 01:51:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బాలింత స్త్రీ మృతి... . వైద్యం వికటించడం వల్లనే నా భార్య మరణం .... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతురాలి భర్త.....

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 29 July 2025 09:31 PM Views : 2429

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జులై 29 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న మత్తమర్రి ఉమాదేవి 26 అనే బాలింత స్త్రీ మంగళవారం మధ్యాహ్నం మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఉమాదేవి మరణించిందని ఆమె బంధువులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాగా ఈ విషయమై ఉమాదేవి భర్త వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలు భర్త బంధువుల కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసవ వేదనతో గత కొద్ది రోజుల కిందట ఉమాదేవి పెద్దపల్లి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరారు. ఆమె గత ఐదో రోజుల కిందట రెండవ కాన్పు లో బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం దురద తీవ్రంగా ఉందని డ్యూటీ డాక్టర్ ను సంప్రదించగా, ఉమాదేవికి దురద నివారణ కోసం ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ చేయడం ద్వారా అది వికటించి కొద్దీ సమయానికి శరీరం అంత వాపులతో నిండిపోయి స్పృహను కోల్పోవడం జరిగింది. ఈ విషయమై ఆసుపత్రికి సూపర్ ఇండెంట్ డాక్టర్ శ్రీధర్ను సంప్రదించగా ఇలాంటి సమయంలో పురుగు కుట్టడం, కలుషిత ఆహారం తినడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. వైద్యం అందించి నివారణకు చర్యలు తీసుకుంటామని మొదట హామీ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఉమాదేవిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. అయితే అప్పటికే ఉమాదేవి మరణించినట్టు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిర్ధారించారు. ఉమాదేవి మృతి విషయంపై మంగళవారం ఉదయం నుండి హైడ్రామా నడిచింది. బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఉమాదేవి మృతితో పెద్ద ఎత్తున ఆందోళన జరగవచ్చని భావించిన పోలీసులు మధ్యాహ్నం నుండి ఆసుపత్రి ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నుండి తెలుగువాడ నుండి ఎవరు బయటకు రాకుండా పోలీసులు కట్టు దిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఉమాదేవి బంధువులు జిల్లా కలెక్టర్ న కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :