Wednesday, 04 March 2026 01:43:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 September 2025 02:26 PM Views : 516

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 5/ అక్షరం న్యూస్/---- భారతదేశ రెండవ రాష్ట్రపతి మొదటి ఉపరాష్ట్రపతి గొప్ప విద్యావేత్త పండితుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని రాహుల్ విజ్ఞాన విద్యాలయం నందు ప్రిన్సిపాల్ వర్మ రాజు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు గురువులై తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వర్మ రాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో గురువు చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటాడు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని అందించడమే కాకుండా జీవన కళ నైతికత క్రమశిక్షణ మార్గాన్ని నేర్పించడం ద్వారా వారికి జీవన విధానాన్ని చూపించడం జరుగుతుందన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డి ఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభ నుంచి ఎంతో నేర్చుకున్నామని వారి సూచనలు సలహాలతో ముందుకు సాగుతున్నం అని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎంవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ గణితం ప్రతి ఒక్కరి జీవితాలకు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తెలుగు ఉపాధ్యాయులు కొంగూరి ప్రదీప్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు తెలుగు పట్ల రసజ్ఞత కలిగి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం పదోవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయని ఉపాధ్యాయులను పూల గుచ్చాలతో చిరు బహుమతులతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి భారతి కొసరాజు హరి చరణ్ బోసు బాబు ఎస్.కె ఉస్మాన్ బి శ్రీధర్ బాబు క్రాంతి కుమార్ రమాదేవి సునీత జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :