AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 16/ అక్షరం న్యూస్/---- మన్యంలో నివసించే ఆదివాసీలకు వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు వర్ణనాతీతం. అందులో గర్భిణీ స్త్రీ లైతే మరి వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బట్టి గూడెం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ రవ్వ బీమా సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ కుగ్రామం. ఒకపక్క పురిటి నొప్పులు అధికమవడం మరోపక్క చీకటి పడటంతో మరో గత్యంతరం లేక గ్రామస్తులు పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ బీమాను జట్టిలో పెట్టి కీకారణ్యంలోని రాళ్లు రప్పలు బురదమయమైన అడవి మార్గం గుండా అతి కష్టం మీద సమీపాన ఉన్న తిప్పాపురం గ్రామానికి చేర్చారు. నడిరోడ్డు పైనే ఆ గిరిజన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు మెరుగైన వైద్యం అందించడం కోసం సత్యనారాయణపురం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తల్లి బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
.
Aksharam Telugu Daily