D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 13 వైరా (అక్షరంన్యూస్) సెక్యులర్, డెమోక్రసీ పాలన కోరుకున్న ఉత్తమ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి భవనంలో సిపిఐ(ఎం) అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐలో అనేక పోరాటాలు నిర్వహించిన సీతారాం ఏచూరి అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందని తెలిపారు. పార్టీలో విసృతంగా ప్రజా ఉద్యమాలను చేపడుతూ పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యసభలో తాను చేసిన ఉపన్యాసాలు భారత ప్రజలు మరవలేనివని, నేటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఉత్తమ రాజ్యసభ గౌరవం దక్కించుకున్న గొప్ప మేధావి, ఆధర్శ నేత, ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. ఇటువంటి గౌరవం పొందడం కమ్యూనిస్టు పార్టీలో ఉన్న వారికే సాధ్యమన్నారు. సెక్యులర్, డెమోక్రసీ పాలన కోసం భారతదేశంలో సెక్యులర్ రాజకీయ పార్టీలను ఇండియన్ బ్లాక్ పేరుతో ఒకే వేదికగా ఏర్పాటు చేసిన గొప్ప మేధావి అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏచూరి ఆలోచన విధానాన్ని సమర్ధిస్తూ ప్రస్తుత భారత మేధావుల్లో అత్యంత మేధావి సీతారాం ఏచూరి అని కొనియాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు, నాయకులు పారుపల్లి కృష్ణారావు, పైడిపల్లి సాంబశివరావు, బొంతు సమత, కొంగర సుధాకర్, సంక్రాంతి నరసయ్య, అనుమోలు రామారావు, కామినేని రవి, తోట కృష్ణవేణి, సంక్రాంతి పురుషోత్తమరావు, ఓర్పు సీతారాములు, పాపగంటి రాంబాబు, బత్తుల ప్రమీల, పారుపల్లి శ్రీనాథ్ బాబు, సంక్రాంతి చంద్రశేఖర్, మాడపాటి మల్లికార్జునరావు, వడ్లమూడి మధు, సంక్రాంతి వినయ్, ఎస్.డి పాషా తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily