Sunday, 29 March 2026 04:52:23 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజాపక్షం వహిస్తున్న అక్షరం దినపత్రిక … అక్షరం దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన.డి సి పి

.


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 15 January 2026 04:49 PM Views : 131

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, జనవరి 15 అక్షరం న్యూస్ : నిత్యం వినూత్న కథనాలతో ప్రజల సమస్యలను నిర్భయంగా వెలికి తీస్తూ, ప్రజాపక్షం వహిస్తూ ముందుకు సాగుతున్న అక్షరం దినపత్రిక ప్రజల మన్ననలు పొందుతోందని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూక్య రామ్ రెడ్డి ప్రశంసించారు. అక్షరమే ఆయుధంగా ప్రజా హితాన్ని కాపాడుతున్న అక్షరం దినపత్రిక సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గురువారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమైన నాలుగో స్తంభమని, ముఖ్యంగా ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతాయుత పాత్రను అక్షరం దినపత్రిక సమర్థంగా నిర్వర్తిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిజాయితీగా, నిర్భయంగా ప్రచురిస్తూ పరిష్కార దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడంలో అక్షరం దినపత్రిక ముందుంటోందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు, న్యాయం, అవగాహన పెంపొందించేలా కథనాలు రూపొందించడం అభినందనీయమన్నారు. అక్షరం దినపత్రిక భవిష్యత్తులో కూడా ఇదే ప్రజాపక్ష ధోరణితో కొనసాగుతూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీసీపీ ఆకాంక్షించారు. అక్షరం యాజమాన్యం, సంపాదక బృందం, పాత్రికేయుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్ పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :