Wednesday, 13 May 2026 04:18:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి ఎంఈఓ

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 10 May 2026 03:35 PM Views : 126

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మే 10 (అక్షరం న్యూస్) ఈనెల 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంఈఓ వై రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలు ఈనెల 11 నుండి 17 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ విద్యా వారోత్సవాల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు అన్ని పాఠశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు అందరూ పాల్గొనాలని అదేవిధంగా తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు కమ్యూనిటీ సభ్యులు వారు భాగస్వామ్యంతో విద్యా వారోత్సవాలు జరగడం జరుగుతుందని అన్నారు విద్యా వారోత్సవాల కార్యక్రమాల వివరాలు ఒకటవ రోజు పునాది దినోత్సవం మరియు వేసవి శిబిరాలు అన్ని పాఠశాలలో పునాది దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు భాగస్వామ్యంతో వేసవి శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పాఠశాలలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని అన్నారు రెండో రోజు రెమిడీయల్ క్యాంప్ పదవ తరగతి విద్యార్థుల కోసం రెమిడీయల్ కోచింగ్ క్యాంపుల ప్రారంభోత్సవం జరుగుతుందని చదువుతో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత ఉపాధ్యాయుల బోధన ప్రణాళికను సిద్ధం చేసి అటెండెన్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు మూడవరోజు సర్పంచ్లతో వర్క్ షాప్ నియోజకవర్గస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు మరియు స్థానిక ప్రజాప్రతినితో నిర్వహించే చర్చ సమావేశం జరుగుతుందని అందులో పాఠశాల అభివృద్ధికి అడ్మిషన్స్ మౌలిక సదుపాయాల పారిశుధ్యం పై చర్చ జరుగుతుందని అన్నారు అదేవిధంగా గ్రామ కమిటీలను మరియు స్థానిక సంస్థల్లో సమన్వయం చేసుకునే కార్యక్రమం ఉంటుందని నాలుగవ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మరియు మెగా పిటిఎం పాఠశాల స్థాయి ఇందులో ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి తప్పనిసరిగా బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలని పాఠశాల స్థాయిలో ఉదయం8.30 నుండి మధ్యాహ్నం 2.00 వరకు. మెగా తల్లిదండ్రుల సమావేశం పి.టీఎం నిర్వహించాలి. * విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు మరియు పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించాలి. * ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. * ఉపాధ్యాయుల హాజరు నివేదికను ఎంఆర్సికి సమర్పించాలి. 5వ రోజు గ్రంథాలయ దినోత్సవం * పఠన పోటీలు, కథలు చెప్పడం, పుస్తక ప్రదర్శన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. * లైబ్రరీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి. 6వ రోజు కళలు, క్రాఫ్ట్ మరియు సాంస్కృతిక దినోత్సవం. జిల్లాస్థాయి * డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్స్, పాటలు, నృత్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం * విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించి, విద్యార్థుల నైపుణ్యాలను ప్రదర్శించాలి. 7వ రోజు విద్యా విజయోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమం. * పదవ తరగతి పరీక్షల్లో 540 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయిలో సన్మానిస్తారు. * అర్హులైన విద్యార్థుల వివరాలను పాఠశాలలు వెంటనే పంపాలి. కావున, ప్రధానోపాధ్యాయులందరూ తమ పాఠశాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అదేవిధంగా ఫోటోలు, హాజరు మరియు నివేదికలను విస్మరించకుండా ఎం ఆర్ సి కి సమర్పించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని మండల విద్యాధికారి వైవి రమేష్ పేర్కొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :