Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి తల్లాడ 18 (అక్షరంన్యూస్)* రాజమండ్రి జాతీయ రహదారిపై తల్లాడ మిట్టపల్లి మార్గంలో ఇరువైపులా కంప చెట్లు చెత్తాచెదారం పెరిగి వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారిందని వాహన చోదకులు వాపోతున్నారు, ద్విచక్ర వాహనదారులకు కళ్ళల్లో కంప చెట్లు గుచ్చుకునేలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రహదారిపై ప్రయాణం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని, ఎదురుగా వాహనాలు వస్తే పక్కకు జరిగితే ముళ్ళు గుచ్చుకుంటున్నాయని, కళ్ళు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు, భారీ వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవాలంటే ముళ్ళకంచెలు పెరిగి రహదారి కమ్మేయడంతో ఎటు పోవాలో అర్థం కానీ పరిస్థితి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది, ఆర్ అండ్ బి అధికారులు ఇకనైనా స్పందించి రహదారి వెంట ఉన్న ముళ్లపదలను చెట్లను తొలగించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily