D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రిల్ 5(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో కోమట్లగూడెం (గామపంచాయతీ పరిధిలో ని పెళ్లి సందడిలో పాల్గొనడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లపెల్లి సారయ్య(55) పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారయ్య శనివారం కొమట్లగూడెంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు చెరువు వద్ద కాలుజారి నీటిలో పడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న గంగారం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మహాదేవుని గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
.
Aksharam Telugu Daily