AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ అక్టోబర్ 09/అక్షరం న్యూస్; భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ నయీమ్ ఖురేషి అన్నారు. సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ న్యాయస్థానంలో జరిగిన దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ న్యాయ వ్యవస్థకు ప్రతీకని, ఆయనపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేయడమేనన్నారు. ఇటువంటి సంఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయన్నారు. ప్రభుత్వం తక్షణం దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు.
.
Aksharam Telugu Daily