Tuesday, 18 August 2026 04:56:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మండల స్థాయిలో తొలిరోజు ప్రజావాణి ప్రజల నుంచి మిశ్రమ స్పందన

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 17 August 2026 07:40 PM Views : 49

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా /గంగారం /ఆగస్ట్ -17(అక్షరం న్యూస్ ) గంగారం మండలం లోని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం గంగారం మండలం కేంద్రంలో ని రైతు వేదిక కార్యాలయంలో ప్రారంభమైంది. తొలిరోజు ఎంపిడివో డి వైష్ణవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు.మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు నేరుగా వివరించే అవకాశం కల్పించడంతో ప్రజావాణికి మిశ్రమ స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో డి వైష్ణవి ప్రజలకు హామీ ఇచ్చారుప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.అయితే మండల స్థాయిలో పునఃప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి తొలి రోజున మిశ్రమ స్పందన లభించింది అని చెప్పుకోవచ్చు . సరైన ముందస్తు ప్రచారం కొరవడటం, అధికారుల సమయపాలన పాటించకపోవడం. వల్ల మండల కేంద్రం లో ప్రజలు తక్కువ సంఖ్యలో వచ్చి అర్జీలు అందజేశారు.వచ్చిన అధికారులు చరవాణి చూసుకుంటూ కాలక్షేపం చేయడం కోసమేరుపు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి బాలకిషన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :