Monday, 15 December 2025 07:56:17 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యువత కి ఆదర్శం సుందర మౌనిక సేవాభావం కలిగి ఉండటం అభినందనీయం వనవాసీ ప్రశిక్షణ టోలీ సభ్యులు కొరివింద రామచంద్రయ్య

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 August 2025 06:14 PM Views : 633

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 14/ అక్షరం న్యూస్/---- ఉద్యోగం పొందిన మొదటి నెలలోనే పేద విద్యార్దిని దత్తత తీసుకొని చదివించడం అభినందనీయంమని ఇంతటి మహత్కార్యంకు వడిగట్టిన సుందర మౌనిక యువత కే ఆదర్శనీయమని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రశిక్షణ టోలీ సభ్యులు కొరివింద రామచంద్రయ్య అన్నారు. చర్ల మండలం జిపి పల్లి గ్రామానికి చెందిన సుందర పెద్దిరాజు లక్ష్మి దంపతుల కుమార్తె మౌనిక ఇటీవల ఇండియన్ బ్యాంక్ లో ఆర్ డి వో గా ఉద్యోగం పొందింది. తన మొదటి వేతనం నుంచి 20 వేల నగదును వెచ్చించి వనవాసీ విద్యార్ది నిలయంలో ఒక విద్యార్దిని దత్తతకు తీసుకొంది. ఇలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 20 వేల చొప్పున విద్యార్ది చదువుల కొరకు నగదును అందజేస్తాన్నాని ఆమె అన్నారు. గురువారం వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో నగదు కు సంబంధించిన పత్రాన్ని మౌనిక ఆమె తండ్రి పెద్దిరాజు వనవాసీ అఖిల భారతీయ ప్రశిక్షణ సభ్యులు రామచంద్రయ్య కు అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే గొప్ప మనసును చాటిన మౌనిక యువతీ యువకులకు ఆదర్శప్రాయంగా నిలచారని అభినందించారు. ప్రతి ఒక్కరూ పేద విద్యార్దుల చదువులకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. యువత జీవితం చదువులతోనే ముడిపడి ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని ఒక్కరు చదువుకొని ఉన్నత స్దితికి చేరుకుంటే ఆ కుటుంబం మొత్తం ఆర్దికంగా స్దితిమంతులవుతారని వెల్లడించారు. నిలయ కమిటీ సభ్యుల పనితీరు స్పూర్తిదాయకమని అన్నారు. పేద విద్యార్థుల చదువులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడం అబినందనీయమని పేర్కొన్నారు. విద్యార్దులు సైతం ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ గౌరవ సలహాదారు బివిఎస్ఎల్ నరసింహారావు, ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, సంఘటనా కార్యదర్శి కోరెం రామారావు, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు, నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు పాశికంటి శ్రీదేవి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి కారం శేఖర్ సున్నం రాజేష్ పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :