AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 29/అక్షరం న్యూస్/---- తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవతలను పూలతో పూజిస్తారు. కానీ పూలనే దేవతగా భావించి తెలంగాణ ఆడపడుచులు పూజించే పండుగ బతుకమ్మ. ప్రకృతి అందాలను పూల సౌందర్యాన్ని స్త్రీ శక్తి స్ఫూర్తిని ఐక్యత సౌభ్రాతృత్వం స్త్రీల గౌరవాన్ని ప్రతిబింబించే వేడుక బతుకమ్మ పండుగ. అటువంటి ప్రాముఖ్యత కలిగిన పూల పండుగకు పాకలపాటి సత్యనారాయణ రాజు బతుకమ్మ కానుకగా తేగడ గ్రామంలోని ఆడపడుచులు నిర్మించుకున్న మూడు బతుకమ్మ గద్దెలకు ఒక్కో గద్దెకు మూడు వేల రూపాయల చొప్పున కానుకను ఇచ్చి ఆడపడుచులను గౌరవించారు. పూల పండుగకు ఆడపడుచులకు బతుకమ్మ కానుకను అందించిన పాకలపాటి సత్యనారాయణ రాజుకు ఆడపడుచులు అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily