AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 26/ అక్షరం న్యూస్/--- మండలంలోని 26 పంచాయితీలు అన్ని గ్రామాలను చర్ల జేఏసీ నాయకులు పర్యటించి లంబాడీల వల్ల ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు తాటి రామకృష్ణ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో లేని లంబాడీలు చట్టబద్ధత లేకుండా ఎస్టీ రిజర్వేషన్ ఫలితాలు పొందుతూ అసలైన ఆదివాసులని మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. లంబాడీలు ఏజెన్సీ ఫలాలు పొందుతున్నారని 1976 దొడ్డి దారిన వచ్చిన లంబాడీల తరిమికొట్టే బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి తీసుకొని ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు లంబాడీలు మేము 50 లక్షలు ఉన్నాం అన్న జనాభా 1976 సంవత్సరం ముందు ఎంతమంది ఉన్నారనేది యావత్ తెలంగాణ తెలుసుకోవాల్సింది ఉంది. ఆదివాసి రిజర్వేషన్లు ఉద్యోగాలు ఏజెన్సీ ఫలాలు పొందుతూ మా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని అలా చేసే లంబాడిలను తరమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాస్ చర్ల జేఏసీ వైస్ చైర్మన్ వాసం ముసలయ్య ఆదివాసీ విద్యార్థి సంఘం జేఏసీ కో కన్వీనర్ ఇర్ప ప్రకాష్ దొర చర్ల జేఏసీ కోశాధికారి పూనెం వరప్రసాద్ బెండబోయిన మురళీకృష్ణ పున్నం రామకృష్ణ కోరం సూర్యనారాయణ శ్యామల రామారావు తుర్రం వీరభద్రం బందా స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily