Sunday, 22 November 2026 06:50:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 November 2026 04:37 PM Views : 82

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : పెద్దపల్లి టౌన్ నవంబర్ 20 అక్షరం న్యూస్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని 11వ వార్డులో రంగంపల్లి బస్తీ దవాఖాన వద్ద ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజలకు కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని 3వ వార్డులో గౌరెడ్డిపేట రోడ్డు రైల్వే గేటు వద్ద రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలగనుందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, స్థానిక కౌన్సిలర్లు అనూష మహేందర్‌, అక్కేపల్లి సుజాత క్రాంతి, ఇతర కౌన్సిలర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల నరేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మెప్మా ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :