Sunday, 24 May 2026 01:22:39 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తునికాకు సేకరణకు వెళ్లిన మహిళ పాముకాటుతో మృతి! *కర్నె గండి లో విషాదం..*

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 23 May 2026 04:55 PM Views : 78

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా /కొత్తగూడ/ మే23(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లాకొత్తగూడ మండలం కర్నెగండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి (35) అనే మహిళ పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.​ఘటన వివరాల్లోకి వెళ్తే..కర్నెగండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి గురువారం రోజున కూలీ పనుల్లో భాగంగా అడవికి తునికాకు సేకరణ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆకులను సేకరిస్తుండగా పొదల్లో ఉన్న ప్రమాదకరమైన పాము ఆమెను కాటు వేసింది. గమనించిన తోటి కూలీలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించారు. ​అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. పాము విషం శరీరం అంతా పాకడంతో పరిస్థితి విషమించి పల్లవి ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. మృతురాలికి భర్త సారయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పటివరకు కళ్లముందే తిరిగిన తల్లి శవమై తిరిగిరావడంతో ఇద్దరు కుమారులు, భర్త సారయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి మరణంతో ఆ పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పల్లవి మరణంతో కర్నెగండి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :