D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : **.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ /జనవరి 3 /వైరా (అక్షరం న్యూస్) విద్యా సంస్థల నిర్వాహకులు పాఠశాలలో కళాశాలలో ఏర్పాటు చేసుకున్న బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలి. వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్. వైరా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దినేష్ స్పాట్కస్ లు పేర్కొన్నారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా మూడో రోజు వైరా రావణ యూనిట్ కార్యాలయంలో ఎదుట ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఇన్ఫోసిమెంట్లో భాగంగా ఫిట్నెస్ లేకుండా పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్తున్న వాహనాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దినేష్ స్పాట్కస్ లు మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యాలు కార్యాలయం నందు ప్రతి బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే విద్యార్థులను ఎక్కించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తెలియజేశారు. శనివారం కార్యాలయం ఎదుట విద్యాసంస్థల నిర్వాహకులు పాఠశాల బస్సులను తప్పనిసరిగా ఫిట్నెస్ చేపించుకోవాలి. దాంతోపాటు బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఫైర్ కిట్టు తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం జరగదు. ప్రతి బస్సుకు అనుభవజ్ఞులైన లైసెన్స్ కలిగిన డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి బస్సుకు డ్రైవర్తోపాటు మరో వ్యక్తి ఫుట్ బోర్డ్ వద్ద ఉండాలి. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం మత్తులో బస్సులు తోల వద్దని సూచించారు. అదే విధంగా విద్యాసంస్థల వాహనాల్లో లౌడ్ స్పీకర్స్ లాంటివి ఏర్పాటు చేయవద్దని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. ప్రతి పాఠశాల. కళాశాల బస్సులు ఫిట్నెస్ తోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించకుండా వసూల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించిన అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు హోంగార్డు ఆలీ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily