D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జులై 4 (అక్షరం న్యూస్ ) ఏజెన్సీ గంగారం మండలంలో కోమట్టగూడెం గ్రామంలో గిరిజనులు గిరిజనేతరులు వర్షాధార వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఈ ప్రాంతం పోటీ ప్రపంచంలో ఇంకా వెనుకబడి నట్లే కనిపిస్తుంది ఇక్కడి రైతులు ముఖ్యంగా వరి మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు మోసానికి పాల్పడుతున్నాయి కొత్త కొత్త పేర్లతో వెలుస్తున్న విత్తన కంపెనీలు ప్రతీ సీజన్‌కి కొత్త బ్రాండ్లు పెట్టి ఆఫర్ల పేరిట బోనస్‌లు, టూర్లు బైకులు కార్లు చూపిస్తూ డిస్ట్రిబ్యూటర్లను ఆకర్షిస్తున్నారు ఈ కంపెనీలు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నాయా లేదా అన్నది ప్రశ్నగా మిగులుతోంది పలువురు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఏడాది పంట దిగుబడి రాక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు ప్రతీ సీజన్‌లో ఇలాంటివి పునరావృతం అవుతున్నా అధికారులు మిన్నకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు ఫర్టిలైజర్ విత్తన వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం సాగిస్తున్నది బహిరంగ రహస్యంగా మారింది రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి వ్యాపారుల వద్దకు వెళ్తే మార్కెట్లోకి కొత్తగా వచ్చినవంటూ చాలా దిగుబడి వస్తుందంటూ మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు ఇలా మూడు పువ్వులు ఆరు కాయలు గా వ్యాపారం సాగుతోంది సరైన అవగాహన లేకుండా నమ్మి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంట దిగుబడి రాక నష్టపోతున్నారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపడి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కొత్త కొత్త పేర్లతో వస్తున్న విత్తన కంపెనీలు రైతులను మభ్యపెట్టి కోట్లు గడిస్తున్నాయి తీరుకొక్క పేరుతో మార్కెట్ లోకి వస్తున్న నకిలీ విత్తనాలు రైతులకు శఠగోపం పెడుతున్నాయి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కంపెనీల గిఫ్టులు టూర్లలో తలమునకలై విలాసాలు అనుభవిస్తుంటే కొనుగోలు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మొక్కజొన్న వరి జొన్న పెసర మినుముల వంటి పంటలకు సరైన దిగుబడి రాక ఆందోళన చెందుతున్నారు మరి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు సకాలంలో సీజన్ప్రారంభంలోనే తనిఖీలు చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గం గారం మండలం లో కొంతమంది వ్యాపారులు గిరిజన రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్నారు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. వ్యవసాయం తప్పా మరే దారి లేని రైతులు అప్పుల ఊబిలో మునిగి చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకుంటున్నారు కొందరు దళారీలు, వ్యాపారులు లాభాలు గడిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి
.
Aksharam Telugu Daily