Saturday, 25 July 2026 10:37:11 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎనిమిది మంది మావోయిస్టులు అరెస్టు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 13 October 2025 08:34 PM Views : 1282

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 13/ అక్షరం న్యూస్/----- ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కెల్ నుండి పోలంపల్లి మార్గంలో డిఆర్జీ బృందం మరియు పి ఆర్ పి ఎఫ్ 168 బెటాలియన్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా పోలంపల్లి సమీపంలో ఎనిమిది మంది క్రియాశీల మావోయిస్టులు పేలుడు పదార్థాలు మరియు నిషేధిత సంస్థకు చెందిన ప్రచార సామాగ్రితో సంచారిస్తున్న ఎనిమిది మంది మావోయిస్టులను భాసగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో మూడు లక్షల రివార్డ్ తో ఉన్న ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు. అరెస్టు అయిన మావోయిస్టు కోసాసోడి (28) ( నేంద్ర ఆర్పిసి సిఎన్ఎమ్ ప్రెసిడెంట్) గొట్టుంపర నేంద్ర పోలీస్ స్టేషన్ బీజాపూర్ జిల్లా బాసగుడ నివాసి ఇతనిపై రెండు లక్షల రూపాయల రివార్డు ఉంది. జై సింగ్ మాద్వి(25) ( కమలాపురం ఆర్ పి సి సీఎన్ఎం) సభ్యుడు భాసగూడ పోలీస్ స్టేషన్ జొన్నగూడపర నివాసి ఇతనిపై 50వేల రివార్డు ఉంది. మడకం అండ (27) ( కమలాపూర్ ఆర్ పి సి సీఎన్ఎం సభ్యుడు) కమలాపూర్ జోన్నగూడపారా నివాసి ఇతనిపై 50వేల రివార్డు ఉంది. సోడి హిద్మా (22) ( కమలాపూర్ ఆర్ పి సి మీలిషియా సభ్యుడు) ముచకి బుద్రా (33) (కమలాపూర్ ఆర్ పి సి భూమ్ కల్ మిలీషియా సభ్యుడు) మల్లి రాజు (24)(కమలాపూర్ ఆర్ పి సి మీలిషియా సభ్యుడు) మాద్వి హిద్మా (24)(కమలాపూర్ ఆర్ పి సి మీలిషియా సభ్యుడు) దేవా మద్వి (28)( కమలాపూర్ ఆర్ పి సి ఎకనామిక్ బ్రాంచ్ సభ్యుడు) అరెస్టు కాబడిన మావోయిస్టుల నుంచి టిఫిన్ బాంబులు డిటోనేటర్లు సేఫ్టీ ఫ్యూజ్ లో కార్టెక్స్ వైరు బ్యాటరీలు విద్యుత్ వైర్లు భూమి తవ్వే పనిముట్లు మరియు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో కూడిన కరపత్రాలు బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మావోయిస్టులను జ్యుడీషియల్ రిమాండ్ కై కోర్టు కు హాజరు పరచడం జరిగిందని బాసగూడ పోలీస్ అధికారులు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :