AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/20 నవంబర్/ అక్షరం న్యూస్ లక్ష్మీనారాయణ ను పరామర్శించిన నేతలు.మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు నాయకులు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుడిగా గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న లక్ష్మీనారాయణ నేడు ఇల్లందు బంగ్లోసు వద్ద పనికి వెళ్తుంటే కారు డి కొట్టి భారీ యాక్సిడెంట్ జరిగిందని ఈ యాక్సిడెంట్ లో ఎడమకాలు కింది భాగం విరిగి ఘోర ప్రమాదం జరిగిందన్నారు. దీనికి కారణం సింగరేణి యాజమాన్యమైన అని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య రమేష్ అన్నారు. గత అనేక రోజుల నుండి గేటు వద్దనే కార్మికులందరికీ అటెండెన్స్ వేస్తూ పనులను పురమాయిస్తూ సూపర్వైజర్లు కాంట్రాక్టర్లు రోడ్డుకు దగ్గరగానే విధులను నిర్వర్తిస్తూ ఉంటున్నారనీ తెలిపారు . కార్మికుల రక్షణ కోసం ఒక షెడ్డును నిర్మించి దాంట్లో ఒక రూమును కేటాయించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ సరైనటువంటి స్పందన లేదని ఆయన అన్నారు . సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమంటే యాజమాన్యం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి ఆసుపత్రికి సిఐటియు నాయకులు వెళ్లి లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి తగిన వైద్య సహాయానికి అయ్యే ఖర్చు మానవతా దృక్పథంతో ఇవ్వాలని వారు కోరారు. వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంచి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యాక్సిడెంట్కు కారణమైన కారు డ్రైవర్ని వెంటనే పోలీసులు అరెస్టు చేసి లక్ష్మీనారాయణ కుటుంబానికి తగిన సాయం అందించేలా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. పరామర్శ చేసిన వారిలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు భాస్కర్ , గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ పరామర్శించడానికి వచ్చిన సింగరేణి అధికారులతో సిఐటియు నాయకులు , ఇతర సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులతో చర్చించి తక్షణమే మంచి వైద్యం అందేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు అధికారులు వెంటనే స్పందించి అంబులెన్స్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కు తరలించడం జరిగిందని తెలిపారు.
.
Aksharam Telugu Daily