AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఆగస్టు 21 / అక్షరం న్యూస్ -: తల్లిదండ్రులు తమ సంతానానికి ఇచ్చే గొప్ప ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం వారం సందర్భంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ లోని "మస్జిద్ ఎ ఖుభా " ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చదువు అంటే మార్కులు ర్యాంకులు కాదని, చదువు సంస్కారం నేర్పాలి, పెద్దల పట్ల, ముఖ్యంగా విద్యా బుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే గురువుల పట్ల గౌరవం, వినయం నేర్పాలి అని అన్నారు. తల్లిదండ్రుల అతి గారాబం, అతి భోగలాలసాలు తమకు విద్యాబుద్ధులు నేర్పే ప్రిన్సిపాల్ నే హత్య చేసే స్థితికి ఎలా తీసుకుని వెళ్ళిందో ఇటివలే నల్గొండ జిల్లాలో జరిగిన ప్రిన్సిపాల్ హత్య చూపిందని అన్నారు. ఇకనైనా తల్లితండ్రులు తమ సంతానం దినచర్యల పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని, ప్రభుత్వాలు సైతం పాఠశాలల్లో చిన్న నాటి నుండే పిల్లలకు నైతిక విలువలను తప్పని సరిగా బోధించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మానవతా విలువలు లేని, సమాజం పట్ల బాధ్యత లేని నేటి చదువులు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు సమాజంలో అనైతికత, హత్యాచారాలు, అశాంతికి కారణమవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు మనకు ఇచ్చిన బానిస అనైతిక విద్యా మార్పుకోసం మేధావులు తల్లిదండ్రులు పోరాటం చేయాలని కోరారు. ఈ సమావేశంలో, మసీదు అధ్యక్షుడు అజీజ్ ఖాన్, సోను భాయ్, షబ్బిర్,అన్వర్, ఖరీం ,అజ్హర్ , షమీం తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily