D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) జె న్ టి యూ హైదరాబాద్ నిన్న విడుదల చేసిన మొదటి సంవత్సర రెండవ సెమిస్టరు పరీక్ష ఫలితాలలో పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని షేక్ హసీనా 9.5,పోకల రమాదేవి 9.3,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థిని షేక్ సమీనా 9.3, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ దారోజు విజయ దుర్గ 9.2 8.95, డేటా సైన్స్ విభాగంలో పసుపులేటి సంతోష్ 9.2 , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థి నిమ్మల వికాస్ 9, సివిల్ విభాగ విద్యార్థి కన్నం పూజిత 8.6 , మెకానికల్ ఇంజనీరింగ్ సాయి గణేష్ 8.3 6 తో యూనివర్సిటీ స్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారని, 8.0 ఎస్ జిపిఏ కి పైన 138 మంది విద్యార్థులు ఫలితాలు సాధించారు అని చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ అధ్యాపకులచే తయారు చేయబడిన ప్రాక్టికల్ తో కూడిన మైక్రో షెడ్యూల్ తో పాటు ప్రతి సబ్జెక్టుకు తరగతి బోధనతో పాటు,ప్రాక్టికల్ కూడా నిర్వహించడం వలన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో దోహదపడిందని అన్నారు. ఈ ఫలితాలు యూనివర్సిటీ స్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలని, ఈ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపకులను విద్యార్థులని అభినందనలు తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాంకేతికతను అందిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే మా లక్ష్యం. ఈ ఫలితాలు మా నాణ్యమైన బోధన మరియు ఫ్యాకల్టీ బృందం అందించిన నాణ్యమైన బోధన, విద్యార్థుల అంకితభావం ఈ ఫలితాల వెనుక ప్రధాన కారణం నిదర్శనం అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె లక్ష్మి నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు కృషి, పట్టుదల, సాధన ద్వారానే,సాధ్యమవుతుందని, అది మా విద్యార్థులకి కళాశాలలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే అవలంబించేలాగా ప్రణాళికలు సిద్ధం చేశామని,విద్యార్థులు నిరంతరం సృజనాత్మకంగా, క్రమశిక్షణతో పాఠాలు నేర్చుకోవడం వల్లే ఈ ప్రతిభ సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఇలాగే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆకాంక్షిస్తున్నామ అని అన్నారు. కళాశాల అకాడమిక్ డీన్ డాక్టర్ సుదర్శన మాట్లాడుతూ మెరుగైన ఫలితాలు సాధించడంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో అధ్యాపకుల పాత్ర కూడా అంతే ఉంటుందని, సిలబస్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులను ఎప్పటికప్పుడు నిష్టాతులైన నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి,డిప్లొమా ఇంచార్జి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ ప్రణతి,శ్రీ కుమార్, పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily