Sunday, 27 September 2026 04:20:31 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పర్యావరణానికి పెద్దపీట మట్టి గణనాథుడి నిమజ్జనం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మండపం వద్ద గంగమ్మ ఒడికి గణపయ్య

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 26 September 2026 10:59 AM Views : 67

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ సెప్టెంబర్ 25 అక్షరం న్యూస్ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయకుడి నిమజ్జన వేడుక అత్యంత వైభవంగా మరియు వినూత్నంగా జరిగింది. ఏటా జలవనరులు కలుషితం కాకుండా ఉండేందుకు స్థానిక నిర్వాహకులు, భక్తులు తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది 10 రోజులపాటు గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనం చేశారు మండపం వద్దే గంగమ్మ ఒడికి.. సాధారణంగా భారీ విగ్రహాలను చెరువులు లేదా బావుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే, పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఈ భారీ మట్టి గణపతిని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకర్ సహాయంతో నిమజ్జనం చేశారు. నిరంతరాయంగా నీటిని చిలకరిస్తూ మట్టి విగ్రహాన్ని క్రమంగా కరిగించారు. వినాయకుడి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. "గణపతి బప్పా మోరియా.. మళ్లీ ఏడు త్వరగా రా.." అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాల మధ్య నిమజ్జన వేడుక ముగిసింది. ఆదర్శంగా నిలిచిన బజరంగ్ దళ్ నిర్వాహకులు రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతున్న నేపథ్యంలో, మట్టి వినాయకుడిని ప్రతిష్టించి, దానిని వాటర్ ట్యాంకర్ సాయంతో మండపం వద్దే కరిగించి నిర్వాహకులు సరికొత్త ఆదర్శాన్ని చాటారు. ఈ వినూత్న నిమజ్జన ప్రక్రియపై అటు అధికారులు, ఇటు పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే బాటలో పర్యావరణ హిత వేడుకలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బజరంగ్ దళ్ నిర్వాహకులు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :