Saturday, 29 August 2026 10:54:29 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

హుజురాబాద్ ఐ సీ డీ ఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ - సీడీపీవో సుగుణ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 28 August 2026 08:33 PM Views : 97

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్/ ఆగస్టు 28/అక్షరం న్యూస్ : హుజురాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను సీడీపీవో సుగుణ ప్రకటించారు. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ షెడ్యూల్ వివరాలు: సెప్టెంబర్ 1వ తేదీన: సైదాపూర్ మండలంలోని గొడిశాల-1, గొడిశాల-2, సైదాపూర్-1, సైదాపూర్-2 మరియు హుజురాబాద్ మండలంలోని శాలపల్లి అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాలి. సెప్టెంబర్ 2వ తేదీన: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరివాడ, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి-1, సర్వాయిపేట అంగన్వాడీ కేంద్రాల అభ్యర్థులకు వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తేదీన: హుజురాబాద్ మండలం గొల్లపల్లి, ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, వీణవంక మండలం కొత్తపల్లి, జమ్మికుంట మండలం గోవిందాపూర్, నాగంపేట, మొల్లపల్లి, వడ్డెరవాడ అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాలి. అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు హుజురాబాద్ లోని కేసీ క్యాంపు, దమ్మక్కపేట రోడ్డులో గల సీడీపీవో కార్యాలయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :