D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ రింగ్ రోడ్ సెంటర్లో భారీగా గుంతలు ఏర్పడి వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు, భారీగా దుమ్ము లేచి, దుకాణం దారులను ప్రయాణికులను పాదచారులను తీవ్ర సౌకర్యానికి గురి చేస్తుంది, ఖమ్మం దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోనే ఈ రింగ్ రోడ్డు సెంటర్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి ఖమ్మం నుంచి సత్తుపల్లి రాజమండ్రి వైజాగ్ ఈ రింగ్ రోడ్డు నుండి ప్రయాణించాల్సి వస్తుంది, పెద్ద పెద్ద గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహన చోదకులు గాయాల పాలవుతున్నారు, ఎన్ హెచ్ ఫోర్ అధికారులు ఇకనైనా ఈ గుంతల ను పూడ్చి ఇబ్బందులను తొలగించాలని, వాహన చోదకులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily