Sunday, 15 March 2026 08:08:08 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్ని అడ్డంకులు సృష్టించిన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి తీరుతాం.. *గంగారం మండల అధ్యక్షులు ఇర్ప సూరయ్య*


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 07 July 2025 02:18 PM Views : 469

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 6(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కాంగ్రెస్ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తున్న గొంతుకల అణచివేతలపై పత్రిక విలేకరులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈనెల 7న ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని గంగారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇర్ప సూరయ్య ఒక ప్రకటనలు తెలిపారు కాంగ్రెస్ నాయకుల వేధింపులకు నియోజకవర్గంలో ఇప్పటికీ ముగ్గురు బలిదానం అయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు బెదిరింపులకు గురి చేసినందుకు గాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ చుక్క రమేష్ కుటుంబానికి అండగా గంగారం నుండి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తప్పు చేయని మంత్రి ధనసరి అనసూయకు భయమెందుకు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమలకు నిరసనగా ఈనెల 7న చేపట్టబోయే కార్యక్రమానికి పర్మిషన్ కోసం దరఖాస్తు చేయగా గంట వ్యవధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయడం ప్రజాసామ్యాన్ని కూని చేయడమేననిఅని అన్నారు. మంత్రి సీతక్క భయంతోనే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి సిటీ యాక్ట్ అమలు చేపించడం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజాస్వామ్య బద్దంగా గంగారం మండల ప్రజల స్వేచ్ఛ కోసం బిఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టుతాం కాంగ్రెస్ నాయకుల అవినీతి పైన వార్తలు రాసిన పత్రికా విలేకరుల మీద భౌతికంగా దాడులు చేయడం జరిగిందని అన్నారు ఇసుక దందాలు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు ప్రశ్నించిన వారి పైన దాడులు ములుగు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నవి అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పైరవీకారులకు బ్రోకర్లకు పర్సంటేజీలు ఇచ్చిన ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం సీతక్క మార్క రాజకీయం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్ ను,జర్నలిస్టులను వేధిస్తూ కేసులు పెడుతూ భౌతిక దాడులు చేస్తూ భయపెడుతున్న పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఈ నెల 7న ప్రజా నిరసన కార్యక్రమం ములుగు జిల్లాలో చేసి తీరుతామని అన్నారు సమ్మక్క సారలమ్మ ఉద్యమించినగడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ముఖ్యమంత్రిని తరిమికొట్టింది గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు గంగారం మండల ప్రజలారా! గిరిజన దొరసాని గడిని బద్దలు కొట్టుకొని స్వచ్చందంగా ప్రజలు రోడ్డుమీద వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టాలని ఇర్ప సూరయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఆత్మ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :