Wednesday, 04 March 2026 01:48:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆధునిక భారత నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ : యంఏ. రజాక్..* *అహలే సున్నత్వల్ జామాత్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 April 2025 06:00 PM Views : 883

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 14 / అక్షరం న్యూస్ -:: బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను అహలే సున్నత్వల్ జామాత్ (ఏ.యస్.జే) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాష్ నగర్ లో గల జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ కరీం ఖాద్రీ అధ్యక్షతన జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఏ.యస్.జే ఛైర్మన్ యం.ఏ.రజాక్ ముఖ్య అతిథిగా హాజరై బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛైర్మన్ రజాక్ ప్రసంగిస్తు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈ దేశం లో ప్రజలందరికీ సమానత్వం వచ్చిందని, నేడు దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధం గా మైనార్టీలను ఈ దేశం లో రెండవ శ్రేణి పౌరులుగా చూపించే కుట్ర లో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు ను రాజ్యాంగానికి విరుద్ధంగా సవరించిందని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టలను చేస్తుందని మండిపడ్డారు. బాబా సాహెబ్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైన సిద్ధం గా ఉన్నామని రజాక్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కరీం ఖాద్రీ, ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, ప్రథాన కార్యదర్శి షేక్ యఖుబ్ ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, జిల్లా ట్రేజరర్ సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, సెక్రటరీ జనరల్ మహమ్మద్ అలీం ఉద్దీన్, యూత్ వింగ్ అధ్యక్షుడు షేక్ నయీమ్, మహమ్మద్ ఉస్మాన్, అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :