Friday, 06 March 2026 03:06:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఈనెల 20న జరిగే మున్సిపల్ కార్మికుల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపు..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 September 2025 07:01 PM Views : 376

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 వైరా (అక్షరంన్యూస్) మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అనునిత్యం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు కార్మికులకు పిలుపునిచ్చారు.. బుధవారం వైరా మున్సిపల్ వర్కర్ల సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖమ్మం నగర కార్పొరేటర్ బి. జి. క్లెమెంట్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 20వ తేదీన ఖమ్మంలోనీ గొరిల్లా పార్కు పక్కన ఉన్న అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఖమ్మం జిల్లా మహాసభలు జరగనున్నాయని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మున్సిపల్ రంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఏఐటియుసి ముందు బాగాన ఉండి పోరాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తొలినాలలో తమ జీతాలు పెంచాలని జిహెచ్ఎంసి లోని మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు అప్పటి నియంత ప్రభుత్వాధినేత కెసిఆర్ ఎటువంటి చర్చలు లేకుండా దాదాపు 1500 మంది మున్సిపల్ కార్మికులను తొలగించారన్నారు. మరలా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొనీ తిరిగి తీసుకునేందుకు కృషిచేసి పెద్దన్న పాత్ర పోషించిందన్నారు. 1932వ సంవత్సరంలో హైదరాబాద్, చాదర్ఘాట్ , వరంగల్ , ఔరంగాబాద్ ప్రాంతాలలో జరిగిన కార్మిక పోరాటాలకు ఏఐటీయూసీ లో అంతర్భాగమైన ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. నాటినుండి నేటి వరకు కార్మికుల పక్షాన పోరాడుతూ వస్తున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమేనన్నారు. శతాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టాలను నేటి పాలకులు కాలరాస్తున్నారని, 29 లేబర్ చట్టాలను ఏకం చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తుందన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే కార్ల్ మార్క్స్ ఇచ్చిన పిలుపుతో పోరాడి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే ! మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 10 గంటలకు మార్చే కుట్ర పన్నారన్నారు.. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మోడీ తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను ఒకవైపు అమలు చేయమంటూనే మరొకవైపు జులై 6 వ తేదీన జీవో నెంబర్ 282 ను తీసుకువచ్చి పది గంటల విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. *ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు గారపాటి అశోక్, జిల్లా సమితి సభ్యులు ఎన్ కృష్ణ , యు ఉపేందర్, రాయపూడి శ్రీను, బోళ్ల శ్రీనివాస్, ఉప నూలాసాంబ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :