D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 26 (అక్షరం న్యూస్) 20 వ వార్డ్ సిఎస్ ఐ చర్చి రోడ్ నందు వన మహోత్సవం లో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణి కార్యక్రమాన్నిమొదటగా పువ్వాళ్ళ రాము ఇంటి దగ్గర కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు స్వయంగా మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల పంపిణీ అనేది సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అని మరియు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కను నాటడం ఎంత ముఖ్యమో, అది ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అని,పచ్చదనాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు భూగర్భ జలాల స్థాయిని మెరుగుపరచడం అందరి భాద్యత అని తెలిపారు. మనం నాటే ప్రతి చిన్న మొక్క రేపటి తరానికి పెద్ద ఆస్తి అవుతుంది. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించడం మన బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కాంగ్రెస్ నాయకులూ పువ్వాళ్ళ రాము, బిక్యా, పండు, హుస్సేన్,పృథ్వి ,నవీన్,కృష్ణ , రవి,జవాన్ అనిల్, గ్రామ దీపిక తిరుపమ్మ,రాణి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily