Friday, 30 October 2026 03:38:10 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్రంలో ఏదులాపురం మునిసిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 30 October 2026 02:05 PM Views : 124

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 30 (అక్షరం న్యూస్) ఏడులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఏడులాపురం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఏడులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు సింగరేణి కాలనీ వద్ద రూ. 496 లక్షల అంచనా వ్యయంతో 46 అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు, రూ. 250 లక్షల అంచనా వ్యయంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జి నుండి కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోటనారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ రోడ్లతో సాయి ప్రభాత్ నగర్ వన్ అండ్ టూ, టెంపుల్ సిటీ, అభయ టౌన్‌షిప్, సింగరేణి కాలనీ, గుర్రాలపాడు తండా, ఇందిరమ్మ కాలనీ, కోట నారాయణపురం, సూర్యా నగర్, చంద్ర నగర్, చిన్న తండా, కె.ఎల్.ఆర్. నగర్, బృందావనం, గోకుల కృష్ణ నగర్, తాశిల్లీ తండా, లక్ష్మీ గాయత్రి నగర్, నందన వనం, ఏడులాపురం, ఆదిత్య టౌన్‌షిప్, గుర్రాలపాడు ఆర్.టి.సి. కాలనీ, శ్రీవారి నగర్, సత్య సంకల్ప కాలనీ, షాబాద్ మాసరెడ్డి నగర్, వరంగల్ క్రాస్ రోడ్, కోదాడ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల ప్రజలందరూ నిరంతరం రాకపోకలు సాగిస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 6, 7, 8 డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 79 కోట్ల 79 లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేసుకున్నామని, కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఏడులాపురం మున్సిపాలిటీని ఎన్నికల ముందు నుంచి కూడా అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీసుకొస్తామని ఇచ్చిన మాటి ప్రకారం ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 100 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని తెలిపారు.  మున్సిపాలిటీలో 8 నుంచి 11 గ్రామ పంచాయతీలు కలిసి ఉన్నందున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈ విశాలమైన మున్సిపాలిటీని తీర్చిదిద్దాలనే తపనతో ముఖ్యమంత్రి ఏది కాదనకుండా సహకరిస్తున్నారని అన్నారు. కేవలం రోడ్లు, డ్రైన్లే కాకుండా తాగునీరు సమస్యను, విద్యుత్ సమస్యలను హైటెన్షన్ లైన్ల తొలగింపు తదితరాలను పరిష్కరించామని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా పేదవాళ్లకు అండదండగా ఉంటూ, భద్రత, భరోసా కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్.టి.సి. బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, కొత్త రేషన్ కార్డులు, పేదవాళ్ళు తినడానికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా గడిచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్లు సున్నా వడ్డీనిచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు. పేదోడి కల ఇందిరమ్మ ఇల్లు అన్నట్లుగా, పేదవాడు చనిపోయేలోపు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనే కోరికను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు, రెండో విడత 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాదులో లక్ష ఇళ్లు, మొత్తంగా 8 లక్షల ఇళ్లకు 40 వేల కోట్ల రూపాయలు పేదింటి ఆడబిడ్డకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కులం, మతం, పార్టీ అనకుండా కేవలం పేదవాడై ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అమలు జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.  ఏదులాపురం మునిసిపాలిటీకి ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చు పెట్టామని, రాబోయే రోజుల్లో మరో రూ. 100 నుండి 150 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి డొంకను, ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, కేవలం వారం రోజుల్లోనే రూ. 30 కోట్ల విలువైన శంకుస్థాపనలు ఏదులాపురం మునిసిపాలిటీలో జరిగాయన్నారు. అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయన్నారు. అన్ని ఏరియాలలోనూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేలా సమగ్ర అభివృద్ధి జరుగుతోందని అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు పనుల పూర్తికి ఇంజనీరింగ్ అధికారులను డెప్యుటేషన్ పై తెప్పించడం జరిగిందని, త్వరలోనే ఈ పనులన్నీ పూర్తిగా వేగవంతం చేసి పూర్తి చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :