Wednesday, 04 March 2026 01:41:56 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇండ్ల కేటాయింపులో అధికారపార్టీ నాయకుల జోక్యాన్ని నివారించాలి .....సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 17 May 2025 07:32 PM Views : 710

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే 17 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని ప్రభుత్వ పథకాలలో పారదర్శకతను, ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుందని,ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధుల, అధికార పార్టీ నేతల జోక్యాన్ని నివారించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అవినీతి అవకతవకలను అరికట్టాలని కోరుతూ గంగారం మండల కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రదర్శన, ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రాతిపదికగా నిరుపేదలకు ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను గ్రామసభల ఆమోదం తో కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని నామినల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చేసే ఎంపిక ప్రక్రియను రద్దు చేయాలన్నారు. ప్రజాపాలన పేరుతో అమలు చేస్తున్న పక్షపాత ఏకపక్ష విధానాలకు స్వస్తి పలకాలని,ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దు చేసి ఇండ్ల ఎంపిక బాధ్యతను అధికారులకు అప్పగించాలని కోరారు పదేళ్ళ టిఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలతో సాగిందని, తాము అధికారంలోకి వస్తే పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామని హామీయిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి గత ప్రభుత్వాలను తలదన్నే విధంగా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నదని గౌని ఐలయ్య అన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ యిండ్లు యిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ స్వంత పథకంగా మార్చివేసిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను వేసి ఎలాంటి ప్రమాణాలు, పద్ధతులు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఇండ్ల కేటాయింపులు చేస్తున్నారని, సమగ్ర ఇటింటి కుటుంబ సర్వే చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి పేర్లను పంచాయతీ గ్రామ సభలలో చదివి ఆ లిస్టులను ఆన్లైన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సర్వే ప్రకారం నిరు పేదలైన వారికి ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుండా గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పేర్లు రాయించుకొని ఎమ్మెల్యే, ఇన్ చార్జ్ మంత్రుల సిఫారసులతో లిస్టు ఫైనల్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే నియోజక వర్గానికి 3500 ఇండ్ల చొప్పున లబ్దిదారుల లిస్టు ఫైనల్ అయిందని, 2వ, 3వ దశ లిస్టులు కూడా ఫైనల్ అవుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించాడని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భారీగా అవినీతి, అశ్రిత పక్షపాతం చోటు చేసు కొంటున్నాయని అన్నారు. గతంలో టీఆరిస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేల ద్వారా కేటాయింపులు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేక రావటం, కోర్టుకూడా జోక్యం చేసుకోవటంతో వెనక్కి తగ్గి లాటరీ పద్దతిలో ఇండ్లను ఎంపిక చేసే విధంగా జీవో నెంబర్ 12ను తీసుకొచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆ పద్దతిని కూడా పాటించకుండా ఇష్టాను సారంగా, ఏకపక్షంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు పాల్పడుతున్నదని ఆరోపించారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అవకాశం యివ్వకుండా ఇన్ చార్జ్ మంత్రి ఆమోదంతోనే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరగాలని నిబందన పెట్టిందని,ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వ పథకంగా కాకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్వంత పథకంగా అమలు చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకొంటున్నదని విమర్శించారు.ఈధర్నాలో పార్టీ జిల్లా నాయకులు బూర్క వెంకటయ్య, ప్రగతి శీల మహిళా సంఘం(POW) జిల్లా సహాయ కార్యదర్శి వజ్జ సమ్మక్క, ఏఒకేఎంఎస్ జిల్లా నాయకులు యాప వెంకటయ్యలు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు ఈసం సారయ్య,మాజీ జడ్పీటీసీ సువర్నపాక పుల్లక్క,పసునూరి రాజమల్లు,ఈసం జగ్గారావు, జోగ వెంకటయ్య, జెజ్జరి సుభద్ర, సిద్దబోయిన లక్ష్మీ, వాసం సరోజన,మొల్కం పోతక్క,పీడియస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, రాష్ట్ర నాయకులు బోనగిరి మధు, పోలెబోయిన కిరణ్ కుమార్, గుర్రం అజయ్,మర్రి మహేశ్,పుల్లూరి సింహాద్రి, మాదారపు నాగరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :