MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా/పాల్వంచ/ డిసెంబర్ 26/ అక్షరం న్యూస్ : ఆదివారం జరిగే స్వర్ణోత్సవ వేడుకలు విజయ వంతం కావాలని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల నందు పాఠశాల గేట్ నుండీ రాజపురం వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ వి. రామకృష్ణ స్వర్ణోత్సవ ర్యాలీ ప్రారంభించారు. స్వర్ణోత్సవ వేడుక విజయవంతం కావాలి 'అనీ నినాదాలతో డ్యామ్ సైట్ ఏరియా మారుమోగిపోయింది. ఆదివారం జరిగే కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఆదివారం జరిగే స్వర్ణోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని 1996 బ్యాచ్ కు చెందిన తేజావత్ హరిలాల్ 100కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు పూర్వ ఉపాధ్యాయులు యస్కె ఖాదర్, రమేష్ రెడ్డీ, శ్రీనివాస్ కుమార్, ధా రావత్ తావురియా, గొంది వెంకటేశ్వర్లు, పడిగా సత్యనారాయణ, రమేష్ రాథోడ్ లు శాలువా తో సన్మానం చేసి అభినందనలు తెలుపారు. ఈ సందర్భంగాపాటశాల , జూనియర్కాలేజీ ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, రమేష్ లు లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసమే కాకుండా పూర్వ ఉపాధ్యాయులను సన్మానం చేయటం మాకు ఆనందంగా వుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్ధులు , ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily