Monday, 02 March 2026 09:38:42 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : 

-250 మంది విద్యార్థులకు గాను 70 మందికి పైగా విద్యార్థులు JEE అడ్వాన్స్ ఎగ్జామ్స్ కి అర్హత ...-విధ్యార్ధులను, కళాశాల అధ్యాపకులను   అభినందించిన చైర్మన్ వరద రెడ్డి...


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 April 2025 06:28 PM Views : 1364

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పొట్టి శ్రీరాములు /నెల్లూరు : జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  నెల్లూరూ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ ఛైర్మన్ వరదారెడ్డి అభినందించారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మంచిర్యాంకులు సాధించడం అభినందనీయం అని ఛైర్మన్ అన్నారు.  ర్యాంకులు సాధించిన వారిలో వెంకట్ కౌశిక్ ఆల్ ఇండియా 141 ర్యాంక్, ఉజ్వల్ పుత్తూరు 509 వ ర్యాంకు, ప్రతాప్ రెడ్డి 3279,వెంకట్ మోహిత్ రెడ్డి 5836 ర్యాంక్, ప్రణీత్ కుమార్ 6998 ర్యాంకులు,సాధించారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి గాను 250 మంది విద్యార్థులకు గాను 70 మందికి పైగా విద్యార్థులు JEE అడ్వాన్స్ ఎగ్జామ్స్ కి అర్హత సాధించారు.మరియు పదివేల లోపు 25 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయానికి సంతోషాన్ని వ్యక్తపరిచిన చైర్మన్ వరద రెడ్డి, డైరెక్ట్ సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, జిఎం రాజేంద్రప్రసాద్, డిజిఎం గోవర్ధన్ రెడ్డి, ఏపీ డిన్ అరవింద్,లు మాట్లాడుతూ..భవిష్యత్తులో మరింత అత్యుత్తమమైన ర్యాంకులు సాధించేల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చైర్మన్ వరద రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, ఏజీఎం వెంకటేశ్వర్లు నాయుడు, ప్రిన్సిపల్స్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :