GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : “ రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఏప్రిల్ -4(అక్షరం న్యూస్ ) సిరిసిల్ల పరిధిలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు “పొలం బాట – ప్రజా బాట” కార్యక్రమాన్ని ఎస్.ఈ బిక్షపతి నాయకత్వంలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని ఎన్పీడీసీఎల్ (ఆపరేషన్ )సి.ఈ అశోక్ తెలిపారు. శనివారం ముస్తాబాద్ మండలం తెర్లు మద్ది గ్రామం లో గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ -నవీన్ తో కలసి ప్రజా పాలన ప్రగతి నివేదిక లో భాగంగా ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకచ్చారు, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రమాదకరంగా ఉన్న లూజ్ లైన్లు, వంగిన స్థంబాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు వంటి సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి తక్షణమే సరిచేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా విద్యుత్ పనులు చేయకూడదని, ఏ సమస్య ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు ముస్తాబాద్ సబ్‌స్టేషన్ తనిఖీ – సాంకేతిక మెరుగుదలపై దృష్టి ముస్తాబాద్ 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను సి.ఈ అశోక్ స్వయంగా తనిఖీ చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్ యార్డ్, నిర్వహణ విధానాలు, భద్రతా చర్యలు, విద్యుత్ సరఫరా నాణ్యత, సాంకేతిక పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ఓవర్‌లోడ్ ఫీడర్లు ఉన్నచో వెంటనే లోడ్ బదలాయింపు చేపట్టాలని, అవసరమైన చోట కొత్త బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచేందుకు సాంకేతిక చర్యలు తీసుకోవాలని, అవసరాన్ని బట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని సి.ఈ అశోక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ -నవీన్, సి ఈ ఆపరేషన్ అశోక్, ఏ డి ఈ శ్రీనివాసులు, ఏ ఈ ముస్తాబాద్ విష్ణు తేజ, ఎల్ ఐ శ్రీనివాస్, లైన్ మెన్ రాంబాబు, అసిస్టెంట్ హెల్పర్ వెంగలిరెడ్డి గ్రామ కార్యదర్శి సౌజన్యతో పాటు వార్డు సభ్యులు బద్ధ రాములు, చిర్రం మహేష్, నీతేట్ల రూప, కొమ్మెట రాజు, అంతడుపుల మంజుల దేవయ్య, కొమ్మెట రాజలింగయ్య, కొండం విష్ణు, జంపెల్లి తిరుపతి, గోక దివ్య–స్వామి, మామిండ్ల కనకవ్వ–శ్రీనివాస్ రైతులు, సిబ్బంది . పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily