Sunday, 22 November 2026 06:50:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నిరుపేద యువతి వివాహానికి లయన్స్ క్లబ్ ఆపన్నహస్తం పుస్తెమట్టల కోసం రూ. 50 వేల నగదు అందజేత

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 November 2026 04:25 PM Views : 48

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 21 అక్షరం న్యూస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక నిరుపేద కుటుంబంలోని ఆడబిడ్డ వివాహానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి రంగనాయక సభ్యులు అండగా నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.మండలం లోని ముత్తారం గ్రామానికి చెందిన అంకం మాధవి-మల్లయ్య దంపతుల కుమార్తె సౌజన్య వివాహం రాజ్ కుమార్‌తో నిశ్చయమైంది.పెళ్లి ఖర్చులు, పుస్తెమట్టల కొనుగోలు కోసం ఆ కుటుంబం లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆశ్రయించగా, వారు తక్షణమే స్పందించారు.క్లబ్ సభ్యులందరి సహకారంతో సేకరించిన రూ. 50వేల నగదును శనివారం పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ లింగాల తిరుపతి రెడ్డి,కార్యదర్శి తాళ్ల మురళీకృష్ణ,కోశాధికారి వీరబోయిన స్వామి,డిసి రూరల్ సర్వీసెస్ సభ్యులు కొమ్ము కరుణాకర్,ఉపాధ్యక్షులు నల్ల మధుకర్ రెడ్డి,పూర్వ అధ్యక్షులు అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,సభ్యులు బండి సంపత్,దిడ్డి శ్రీనివాస్,వీరబోయిన శ్రీకాంత్, పులిపాక రవీందర్,మల్లారపు శంకర్,కీర్తి రాయగట్టు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :