GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతి నగర్ ఎన్టిపిసి ఫిబ్రవరి 16 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ రామగుండం నగర పాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా మేయర్ బరిలో ముగ్గురు ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు చైర్మన్ కావడంతో గెలిచిన వారిలో ఎస్సీ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు మహంకాళి స్వామి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రామగుండం మున్సిపాలిటీగా మారిన తర్వాత జనరల్ కు కేటాయించగా సోమారపు సత్యనారాయణ గెలిచారు ఆ తర్వాత 2005లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ గా మారింది. ఆ సమయంలో కూడా యూత్ కాంగ్రెస్ లో ఉన్న మహంకాళి స్వామి చైర్మన్ పదవికి పోటీపడ్డాడు. ఆ సమయంలో చైర్మన్ అభ్యర్థి కోసం ఒక కమిటీ వేయగా ఆ కమిటీ లో ప్రధానంగా బడికెల రాజలింగం మహంకాళి స్వామి పేర్లు వచ్చాయి వారిద్దరూ తమ ఆస్తిపాస్తులను ఖర్చులను కూడా వివరించారు. అప్పటికే ఏమి తీసిపోని మహంకాళి స్వామి, అన్ని హంగులు సమకూర్చారు. కానీ సీనియర్ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాడని సానుభూతితో రాజలింగంకు టికెట్ కేటాయించారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పొత్తుతో మున్సిపల్ చైర్మన్గా బడికిల రాజలింగం డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచారు. చివరికి ఈ అవకాశం మళ్లీ 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రస్తుతం మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన నెల కంటి రాము, ఒకటవ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన మడిపల్లి విజయ పోటీ పడుతున్నారు. మేయర్ అభ్యర్థి పదవి ముఖ్యమంత్రి నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులతోనే ఈ పదవి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో సీనియర్ కౌన్సిలర్ పాత పెళ్లి ఎల్లయ్య, అంజుల్ మైనారిటీ విభాగంలో ముస్తఫా, , సాహిద ఆసిఫ్ పాషా, మారెల్లి రాజిరెడ్డి కొలను కవిత రెడ్డి ఉన్నారు. వీరిలో డిప్యూటీ మేయర్ పదవి కాలనీ, ఎన్టిపిసి, రామగుండం నుంచి ఒకరికి లభించే అవకాశం ఉంది. టిఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్గా గెలిచిన నలుగురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 44 కు చేరింది. భారీ మెజార్టీతో మేయర్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మేయర్ డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుంది అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కార్పొరేటర్ అందరూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నారు
.
Aksharam Telugu Daily