P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జూలై 23 (అక్షరం న్యూస్) నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా మరియు మానేరు పరివాహక ప్రాంతం రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దీకొండ రమేష్ తెలియజేశారు ఈ సందర్భంగా అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని రైతులు మరియు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా గ్రామాలలో ఏదన్న ఐరన్ కరెంటు స్తంభాలు ఉంటే వాటికి కరెంటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు వాటిపై జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా గృహాలలో బట్టలు ఆరేసుకునే ఐరన్ తీగలకు గోడలు వర్షానికి నాని కరెంటు వచ్చే అవకాశం ఉన్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అదేవిధంగా తడిసిన గోడలకు కూడా కరెంటు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని . ముఖ్యంగా రైతులు కరెంటు మోటార్ల కాడికి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని కరెంట్ స్టార్టర్ డబ్బాలకు పవర్ వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ముందుగా కరెంటు వస్తుందా లేదా అనే విషయం టెస్టర్ ద్వారా చూసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే దానికి సంబంధించిన కరెంటు అధికారులను పిలిపించి సమస్యను పరిశీలించుకోవాలని అదేవిధంగా. భారీ వర్షాల వల్ల వరదనీరు వెళ్లే ప్రాంతాలకు వెళ్లకూడదని ఎక్కువ నీళ్లు నిలవడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏర్పడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామాలలో పాతబడి ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని కోరారు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఒ ర్రెలు విపరీతమైన వరదనీటితో ప్రవాహం రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున వాటిపై జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని. ఎస్సై దీకొండ రమేష్ తెలియజేశారు
.
Aksharam Telugu Daily