GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 07/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావ హుల్లో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ పరిదిలో మొత్తం 30వార్డులు ఉండగా, 16,870 మంది పురుషులు, 17,724మంది మహిళలు, మొత్తం 34,595 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీ వల జరిగిన పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకున్న విధంగా కాకుండా మేజర్ గ్రామపంచాయతీలో మెజార్టీగా ఎస్సీ సామాజిక వర్గానికి ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేస్తే మా పరిస్థితి ఏంటి అని ఓ సి, బి సి సామాజిక వర్గానికి చెందిన ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎలక్షన్లో ఖరారు చేసిన వార్డుల వారిగా రిజర్వేషన్లను ఎలక్షన్ అధికారులు కొనసాగిస్తారా? ఇక ఏమైనా మార్పులు చేస్తారా? అనే సందేహంలో వివిధ పార్టీల నాయకులు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల లిస్ట్లను వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా పై అభిప్రాయాల సేకరణ మున్సిపల్ కమిషనర్ సేకరించారు. *ఈనెల 10న ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్న ఎలక్షన్ అధికారులు* 10న ఫైనల్ లిస్ట్ విడుదల చేయను న్నారు. వార్డుల్లో పోటీ చేయడం కోసం ఆశా వ హులు వ్యూహరచన చేస్తున్నారు. ఏ సామా జిక వర్గానికి రిజర్వేషన్ వచ్చినా తమ అభ్య ర్థులను పోటీలో ఉంచేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అనుకున్న వార్డు రిజర్వ్ కాకపోతే ఇతర వార్డుల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. కొంత మంది ఇప్పటి నుంచి రెండు వార్డులపై ఫోకస్ పెడుతున్నారు. జన రల్ కాకుండా మహిళలకు రిజర్వ్ అయితే తమ కుటుంబ సభ్యులను బరిలో దింపేం దుకు రెడీ అవుతున్నారు. పార్టీ బీ-ఫామ్ రా కుంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉందామనుకునే వారు కూడా వార్డుల్లో పర్యటి స్తు న్నారు. గతంలో వారు చేసిన సేవా కార్యక్రమాలు వార్డులో నివాసం ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేశారో వివరిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. మున్సిపల్ పరిధిలో మహిళ ఓటర్లు, యువత ఓటర్లు ఎక్కువ ఉండడంతో అందరి దృష్టి మహిళా , యువత ఓట్లు ఎక్కువగా ఉండడంతో మున్సిపల్ పరిధిలో ఉండే అభ్యర్థులు వారికి అనుకూలంగా హామీలను సిద్ధం చేసినట్లు చర్చించుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily