AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/ కొత్తగూడెం / ఫిబ్రవరి 9 / అక్షరం న్యూస్ - : స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కొత్తగూడెం శాఖ వారి తరఫున కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొత్తగూడెం యువత విద్య, ఉపాధి సంబంధిత మరియు ప్రజా సమస్యలు, అవసరాలను వివరిస్తూ ఆదివారం ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడమైనది. మెమోరాండం లోని ముఖ్యంశాలను ఎస్ ఐ ఓ కొత్తగూడెం యూనిట్ అధ్యక్షులు సమీర్ రసూల్ వివరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. సింగరేణి కాలరీస్, కే టి పి ఎస్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్, బి పి ఎల్ ( ఐ టి c ), స్పాంజ్ ఐరన్ యూనిట్లు, బి టి పి ఎస్ వంటి పరిశ్రమల ద్వారా అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగూడెంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వార్డ్ కార్పొరేటర్లు చురుకుగా చర్యలు తీసుకోవాలి అని ప్రగతి మైదాన్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను పునరుద్ధరించి, ఆధునిక పరికరాలు మరియు కొత్త సాంకేతికతలతో పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయాలి. కమ్యూనిటీ సెంటర్ల ద్వారా వృత్తి, కంప్యూటర్, ఐటీ మరియు ఆధునిక సాంకేతిక శిక్షణలను అందించి, ఉద్యోగ నియామకాలు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా యువతలో నిరుద్యోగం మరియు వలసలను తగ్గించాలి అని కొత్తగూడెంలో గత ఏడాది 70కిపైగా మాదకద్రవ్య కేసులు నమోదయ్యాయి; 221 మందిని అరెస్ట్ చేసి సుమారు ₹28.54 కోట్ల విలువైన 5,770 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది గంజాయి మరియు డ్రగ్స్ సమస్య తీవ్రంగా పెరుగుతోందని సూచిస్తోంది. కావున మాదకద్రవ్యాల అక్రమ వినియోగం మరియు రవాణాపై కఠిన పర్యవేక్షణ చేపట్టి, బాధితులకు కౌన్సెలింగ్ మరియు పునరావాస కేంద్రాల సౌకర్యం కల్పించి, యువత కోసం మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కార్యక్రమాలు నిర్వహించాలి అని 1) విద్యను బలోపేతం చేయడం & విద్యార్థి మద్దతు వ్యవస్థ స్థాపన ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు (ఆర్ టి ఈ 2009) చట్టం అమలు: ప్రతి మున్సిపల్ కార్పొరేటర్ తమ పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించి పిల్లలు మరియు యువజనుల విద్యా స్థితిని అంచనా వేయాలి—ఎంత మంది ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు, ఎంత మంది చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారు, ఎంత మంది చదువుకోలేదు, ఎంత మంది ఉపాధి పొందుతున్నారు అనే విషయాలను గుర్తించాలి అని 6–14 సంవత్సరాల పిల్లలకు ఉచిత, తప్పనిసరి మరియు నాణ్యమైన విద్యను పూర్తిగా అమలు చేయడానికి వెనుకబడిన ప్రాంతాల్లో విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చేరికలు మరియు విద్య కొనసాగింపును ప్రోత్సహించాలి అని విద్యా అసమానతను తగ్గించేందుకు అభివృద్ధి చెందని మరియు వెనుకబడిన ప్రాంతాల్లో మోడల్ పాఠశాలలను స్థాపించాలిఅని. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో ప్రస్తుతం ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలు లేనందున ఒక కొత్త పాఠశాలను ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వ పాఠశాలల్లో తగిన బోధన మరియు బోధనేతర సిబ్బందిని నియమించి, ఆర్ టి ఈ ప్రకారం విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (ఉదా: 1:30) పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేయాలి. ప్రైవేట్ పాఠశాలల్లో క్యాపిటేషన్ ఫీజులను నిషేధించే ఆర్ టిఈ–2009 చట్టం నిబంధనలకు అనుగుణంగా పాఠశాల ఫీజులు, యూనిఫార్ములు మరియు ఇతర ఖర్చులను నియంత్రించి అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాలి అని అభ్యాసం మరియు సమాజ విద్యకు మద్దతుగా ప్రతి వార్డులో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి అని స్కాలర్‌షిప్‌లు, పరీక్షలు, కెరీర్ మార్గదర్శనం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సహాయం అందించేందుకు కమ్యూనిటీ హాళ్లలో విద్యార్థి సహాయ మరియు మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని ప్రతి వార్డులో ప్రత్యేక కమ్యూనిటీ సెంటర్‌ను స్థాపించాలి అని స్థానిక కార్పొరేటర్లు ఈ కేంద్రాలను సమాజ కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం క్రమం తప్పకుండా వినియోగించాలి అని 2) యువజన నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి సౌకర్యం మన జిల్లాలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వార్డ్ సభ్యులు నిరుద్యోగ యువతను ఈ పరిశ్రమల్లో చేరేందుకు చర్యలు తీసుకోవాలి అని పరిసర ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నందున స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని యువత ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, మున్సిపల్ సంస్థలు ఉపాధి అవకాశాలు మరియు సహాయ కార్యక్రమాలను స్పష్టంగా ప్రకటించాలి అని ప్రగతి మైదాన్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను పునరుద్ధరించి, ఉత్తమ పరికరాలతో పూర్తిస్థాయిలో పనిచేసేలా చేసి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైలరింగ్, డ్రైవింగ్, హెల్త్‌కేర్ వంటి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలి. కంప్యూటర్ మరియు ఐ టి ఆధారిత ఉద్యోగ నైపుణ్యాల కోసం కమ్యూనిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలి అని జాబ్ ప్లేస్‌మెంట్, అప్రెంటిస్‌షిప్ మరియు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక ఉపాధి డ్రైవ్‌లు నిర్వహించి గౌరవప్రదమైన ఉపాధిని ప్రోత్సహించాలి అని ఈ స్కిల్ సెంటర్ల ద్వారా ఇంజినీరింగ్, డిప్లొమా మరియు ఐ టి ఐ విద్యార్థులను ఉద్యోగాలకు అర్హులుగా తయారు చేయాలి అని యువత ఆధ్వర్యంలోని వ్యాపారాలు మరియు స్టార్ట్-అప్స్‌ను ప్రోత్సహించి, ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి అని 3) మానసిక ఆరోగ్యం & సమగ్ర యువజన అభివృద్ధి విద్యార్థులు మరియు యువతలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, మత్తు పదార్థాల వినియోగం, లైంగిక దుర్వినియోగం మరియు సామాజిక ఒంటరితనం వంటి సమస్యలను పరిష్కరించేందుకు మానసిక ఆరోగ్య, పునరావాస మరియు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని పోలీస్ అధికారులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారులు మరియు ఇతర ప్రభావశీల వ్యక్తులు ప్రతి నెల కనీసం ఒకసారి వెల్‌బీయింగ్ సెంటర్లను సందర్శించి సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించాలి అని మున్సిపల్ పాఠశాలలు మరియు కమ్యూనిటీ సెంటర్లలో మానసిక ఆరోగ్య డెస్క్‌లను ఏర్పాటు చేయాలి అని ప్రమాదానికి గురయ్యే మరియు వెనుకబడిన ప్రాంతాల్లో కౌన్సెలింగ్ సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి అని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లైబ్రరీలు మరియు యువజన వేదికలను ప్రోత్సహించాలి అని ప్రాంత స్థాయి స్టడీ సెంటర్లు మరియు ఇండోర్ స్టేడియంలను నిర్మించి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. పాఠశాలల సమీపంలో గుట్కా, సిగరెట్ మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చిన్న వయస్సులోనే పెరుగుతున్న వ్యసనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని మత్తు పదార్థాల వ్యసనాన్ని విడిచిపెట్టేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని రాత్రి సమయంలో పోలీస్ పేట్రోలింగ్‌ను పెంచి శాంతి భద్రతలను మెరుగుపరచాలి అని 4) సురక్షిత, స్థిరమైన & సమగ్ర పట్టణ మౌలిక సదుపాయాలు పాల్వంచ–కొత్తగూడెం రహదారిపై గుంతలు మరియు రోడ్డు దెబ్బతినడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతులను క్రమం తప్పకుండా నిర్వహించాలి. అండర్‌గ్రౌండ్ బ్రిడ్జ్ సమీపంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. రామవరం మరియు ముర్రేడువాగు వంతెనలను తక్షణమే మరమ్మతు చేయాలి అని కొత్తగూడెంలో అనేక ప్రాంతాల్లో సరిపడా వీధి దీపాలు లేవు; పనిచేయని దీపాలను వెంటనే సరిచేయాలి అని పట్టణ ప్రాంతాల్లో రోజువారీ శుభ్రత, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ, తగిన డస్ట్‌బిన్‌లు మరియు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలను పూర్తి చేసి నీటి నిల్వను నివారించాలి అని సివిక్ పనుల అనంతరం రహదారులను నాణ్యమైన విధానంలో పునరుద్ధరించాలి. సురక్షితమైన తాగునీటి సరఫరా, లీకేజీల మరమ్మతులు మరియు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను నిర్ధారించాలి అని వీధి దీపాలు, పార్కులు, ఆటస్థలాలు మరియు ప్రజా భద్రత చర్యలను మెరుగుపరచాలి అని అందుబాటు గృహాలు, పునరావాసం మరియు సమాజ సంక్షేమ ప్రాజెక్టులను ప్రోత్సహించి, మున్సిపల్ నిధులను కులం, మతం లేదా రాజకీయ ఆధారంగా కాకుండా సమానంగా పంపిణీ చేయాలి అని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని మున్సిపాలిటీ నిధులను పేద మరియు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతతో కేటాయించాలి అని వారు ఈ సందర్భంగా కోరడమైనది. మెమోరాండంను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ దీనిపై సానుకూలంగా స్పందించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి ప్రజల నిత్య అవసరాలకు సంబంధించి మరియు హక్కులకు సంబంధించి న్యాయపరమైన డిమాండ్లను స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కొత్తగూడెం శాఖ వారి తరఫున ఇవ్వడమైనదని డిమాండ్లను ప్రభుత్వంతో, మంత్రి పొంగులేటి తో మాట్లాడి పూర్తి చేస్తాను అని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ తాజ్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాల నుండి ఎస్ ఐ ఓ విద్యార్థులు, యువత , ప్రజల హక్కులు మరియు మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి తో పాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన అనేక సేవా మరియు అవగాహన కార్యక్రమాలు చేపట్టుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ ఓ రాష్ట్ర కార్యదర్శి ఏం డి తాజ్, ఎస్ ఐ ఓ కొత్తగూడెం అధ్యక్షులు ఎం డి సమీర్ రసూల్, ఎస్ ఐ ఓ యూనిట్ కార్యదర్శి రియాన్ , ఎస్ ఐ ఓ మెంబర్ ఇబ్రహీం, ఎస్ ఐ ఓ మెంబర్ వహీద్ అలీ బేగ్, ఘాజీ సలావుద్దీన్, యాకూబ్ పాషా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చీకటి కార్తీక్, పిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, పిసిసి జనరల్ సెక్రెటరీ ధర్మారావు, సుజాతనగర్ మండల అధ్యక్షులు శేఖర్, సొసైటీ మాజీ చైర్మన్ మండే వీర హనుమంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేంద్ర త్రివేధి, సిపిఎం పార్టీ లీడర్ లు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily