Sunday, 29 March 2026 04:52:39 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎట్టకేలకు వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్ 39 కరెంట్ మోటార్లు 750 మీటర్ల వైరు స్వాధీనం చేస్తున్న పోలీసులు

ఈజీ మనీ కోసం కరెంటు మోటార్లు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు డిసిపి పి కరుణాకర్


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 19 April 2025 06:16 PM Views : 2293

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి ఏప్రిల్ 19 (అక్షరం న్యూస్) ఇటీవల కొంతకాలంగా వ్యవసాయ కరెంటు మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు 39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం, వీటి విలువ మొత్తం కలిపి 10, 67, 500/- రూపాయలు వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు, శనివారం పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీసీపీ పెద్దపల్లి కరుణాకర్ నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఇట్టి దొంగతనాలకు సంబందించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు పోత్కపల్లి మండల పరిధిలో కానిగొండ గ్రామం శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తన సిబ్బందితో ఉదయం 10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖి చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ తండ్రి పేరు సమ్మయ్య, 25సం, బుడగజంగం, వృత్తి ఇనుప సామాన్ వ్యాపారం , గ్రామం ఓదెల తారకరామ కాలనీ, ఓదెల. ఎ 1 అంగిడి సాయికుమార్ తండ్రి పేరు సమ్మయ్య, 22 సం, ఎరుకల కులం, వృతి కూలి, గ్రామం ఓదెల ఎ 2 అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చిందని . వీరి దగ్గర నుంచి 39 మోటార్స్, 750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారని వీరిద్దరూ ఓదెల గ్రామానికి చెందిన వ్యక్తులని సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుర్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ తండ్రి సమ్మయ్య తో పరిచయం ఏర్పడి. ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ (కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె ఎస్సారెస్పీ కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్నరయనపేట్ మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్ ను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు. ఇట్టి దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన ఎస్సై నీ మరియు సిబ్బంది ఏఎస్ఐ రత్నాకర్ హెడ్ కానిస్టేబుల్ కిషన్ ప్రవళిక కానిస్టేబుల్ రాజేందర్ వెంకటేష్ రవి రాజు శివశంకర్ శంకర్ రామకృష్ణ అశోక్ సతీష్ హరీష్ రజిత ధనలక్ష్మి లను. పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్ అభినందించి రివార్డులను ఎసిపి జి గజ్జ కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సుబ్బారెడ్డి చేతులమీదుగా అందజేశారు సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డికొండ రమేష్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :