D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 22 వైరా (అక్షరం న్యూస్) వైరా మండలం సిరిపురం కేజీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గ్రామ సర్పచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు సీఎం కప్ పోటీలను ప్రారంభించి పోటీలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం కప్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో క్రీడారంగంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను గుర్తించడం జరుగుతుంది. వారి ప్రతిభను గుర్తించిన అనంతరం నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయిలో,రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక చేసి వారిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకు వెళ్లడనికి సీఎం కప్ ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మట్టురి వెంకటేశ్వరరావు,ఉప సర్పంచ్ పుష్పవతి,మాజీ సర్పంచ్ తాటి వెంకటేశ్వర్లు, కామినేని శ్రీనివాసరావు, దరిపల్లి నారాయణ, నాంచారీ, తిరపతిమ్మ, కాటమ్మ, మున్నా, పంచాయతీ కార్యదర్శి నాగ శేష రెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ ఇనపనూరి కృష్ణమ్మ, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ హెచ్ఎం సూర్య కుమారీ, పీటీ సభాన,గ్రామ పెద్దలు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily