AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/ ఆగస్టు 04/అక్షరం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ యాప్‌ల , ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎరువుల బుకింగ్ ప్రక్రియలో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, ఉన్నవారికి కూడా యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైతులు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదు వ్యవసాయం అని.ఎరువులు కొనుగోలు చేయడానికి యాప్‌లు, ఆన్‌లైన్ బుకింగ్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదని అన్నారు . ప్రస్తుతం యూరియా బుకింగ్ జరుగుతున్నట్లు ఆగస్టు ఆరో తారీకు నుండి మిగతా కాంప్లెక్స్ ఎరువులు కూడా అలానే బుక్ చేసుకోవాలని వస్తున్న కథనాలను అదునుగాగ చేసుకొని ఎరువుల డీలర్లు రైతులను మరింతగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఇదే అదునుగా వారి గోడౌన్లు ఖాళీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అదేవిధంగా మండలంలో సుమారుగా 20 మందికి పైగా ఎరువుల డీలర్లు ఉన్న, యూరియా ఎరువులు నిలువులు ఉండకపోవడం విడ్డూరమని,డీలర్లు కాంప్లెక్స్ ఎరువులు ఏవిధంగా అమ్ముతున్నారో యూరియ ని కూడా అమ్మెవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులకు సులభంగా ఎరువులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily