Friday, 06 March 2026 03:05:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇసుక లారీలకు వన్యప్రాణి బలి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 01 August 2025 12:00 PM Views : 2094

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1---- మండలంలోని సుబ్బంపేట పంచాయతీ పరిధిలో గల బి ఎస్ రామయ్య నగర్ సమీపంలోని శుక్రవారం తెల్లవారుజామున ఇసుక లారీ ఢీకొని వన్యప్రాణి నక్క మృతి చెందింది. ఇసుక లారీ ఢీ కొనడం వల్ల నక్క యొక్క శరీర భాగాలు చిందరవందరగా అయిన్నాయి. సుబ్బంపేట పంచాయతీలో విచ్చలవిడిగా ఇసుక ర్యాంపులు ఉండడం వల్ల రోజుకు కొన్ని వందల లారీలు రై రై అంటూ పరుగులు తీస్తున్నాయి. ఈ ఇసుక లారీలు మనుషుల మూగ జీవాల ప్రాణాలను తీయడమే కాకుండా వన్యప్రాణుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. మండల కేంద్రంలోని ఇసుక లారీలు ఒక్కసారిగా పది పదిహేను లారీలు రై రై మంటూ పరుగులు తీయడంతో పాదచారుల వాహనదారుల కాళ్ళల్లో దుమ్ము పడి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపార దారులు లారీల వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల వ్యాపారాలు సాగడం లేదని మనోవేదన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక లారీలను కట్టడి చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :