Sunday, 29 March 2026 04:52:08 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా రిజర్వాయర్ ను సందర్శించిన*... *తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి* *ప్రెస్ అకాడమీ చైర్మన్* *కే శ్రీనివాసరెడ్డి ని


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 19 January 2026 05:14 PM Views : 512

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి/19 వైరా (అక్షరం న్యూస్) వైరా రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కార్మిక చైర్మన్ కే శ్రీనివాసరెడ్డికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ప్రాంతంలోని మిషన్ భగీరథ బోడెపుడి సుజల స్రవంతి మంచినీటి పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబులు కట్టించిన వైరా రిజర్వాయర్ రైతులకు కల్పతరువు లాంటిదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ కు కృష్ణ గోదావరి జలాలను అనుసంధానం చేయటం వలన సాగునీరు త్రాగునీరు అందించటంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణ గోదావరి జలాలు సాగు నీటి వినియోగంలో వాటాల వద్ద ఘర్షణలు లేకుండా వృధాగా పోతున్న నీటిని లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టి రైతులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. నీరు ఉన్నచోటనే సంస్కృతి సంపద ఉంటుందనీ అన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి కృష్ణ జలాలను వినియోగించుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీయూ డబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్ ను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సంఘం నాయకులు ఏపూరి రాజారావు, ఎక్కిరాల శ్రీనివాసరావు అక్కి శెట్టి రవితేజ, సూతకాని శ్రీకాంత్, గొల్లమందల విజయ్, దేవబత్తిని సీతారాములు, ప్రశాంత్, మహేష్, నాగరాజు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :