D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 16 (అక్షరం న్యూస్) వైరా మండలంలోని కేజీ సిరిపురం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భోగి పండుగను పురస్కరించుకొని సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. మహిళలు ఆకర్షణీయంగా వేసిన ముగ్గులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై పుష్పాల రామారావు చేతుల మీదుగా గెలుపొందిన విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్తే రామారావు మాట్లాడుతూ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు నిర్వహించిన సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు నీ అభినందిస్తూ ముగ్గులు వేసిన మహిళలకు, గ్రామ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయన్నారు. అందరూ కలిసి ఒకే చోట ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల మన దేశ నాగారికత సంస్కృతిని కాపాడుకోవచ్చని తెలిపారు.
.
Aksharam Telugu Daily