Friday, 10 July 2026 11:40:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మండలంలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం * 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల కస్టర్ గా తగ్గిస్తే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ-ఏ ఐ వై డిమాండ్.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 July 2026 06:34 PM Views : 29

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/జూలూరుపాడు/జులై 10/ అక్షరం న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జూలూరుపాడు మండలంలో విద్యాసంస్థల బంధు విజయవంతంగా జరిగింది.మండల పరిధిలోని పాపకొల్లు జడ్పీఎస్ఎస్ పాఠశాల ముందు విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి పసుపాటి పవన్, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పృథ్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎట్టినట్టు వివరించడం బాధాకరమైన అన్నారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల కస్టర్ గా చేసి పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఫీజు నియంత్ర చట్టాన్ని అమలు చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టాలని వారి డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను 7వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిపిసిసి చీ ప్ నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేం అధికారంలోకి వస్తే విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంపై అంతర్యం ఏమిటనే ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్య విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్ బాలాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రామ్ చరణ్, చరణ్ కుమార్, వాసు సాయి ధనుష్ దినేష్, ఏఐవైఎఫ్ నాయకులు శివ మధు, ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :