AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 18/ అక్షరం న్యూస్ - వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని రుద్రంపూర్ ముస్లిం మత పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మజీద్-ఏ - క్యూబా లో చేతులకు నల్ల రిబ్బన్ పట్టిలు ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు నుండి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మసీద్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు. కేంద్ర చర్యలను లౌకికవాదులు ఖండించాలని కోరారు. జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు అబ్దుల్ భాషిద్ మాట్లాడుతూ..... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు. కేంద్ర చర్యలను లౌకికవాదులు ఖండించాలని కోరారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ముస్లింలంతా ఉద్యమిస్తారని తెలిపారు.... ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐ ఎన్ టి యు సి కొత్తగూడం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ మాట్లాడుతూ....దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని, మోదీ ప్రభుత్వం ముస్లిం లను అణగదొకేందుకు ఈ చట్టాలనికి సవరణలు చేయాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోను భాయ్, మొహమ్మద్ రఫీ, ఆలం, షమీమ్, మునవర్, అజార్, రహిమత్, ఖాసీం బాబా, షామిమ్ముళ్ళ, ఫహీం, రహీం, అరీఫ్,ఖాసీం, శుక్రు, సోహెల్, అక్రమ్, మదర్ సాబ్, తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily