AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : (కడెం అక్షరం న్యూస్) కడెం పరివాహక ప్రాంతంలో(క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది అందులో నది పరివాహక ప్రాంతం దివన ఉన్న గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విట్టల్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా అక్షరం ప్రతినిధితో మాట్లాడుతూ నేటి నుండి (10.07.2025) కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుండి నీళ్లను వదిలే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతంలోకి దిగువన పశువులు గాని గొర్రెలు గాని మొదలగునవి వెళ్లకుండా అలాగే పల్లెకారులు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలెనని తెలియజేశారు నది దిగువన ఉన్న గ్రామాల ప్రజా ప్రతినిధులు అధికారులు పోలీసులు రెవెన్యూ శాఖ గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కడెం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు
.
Aksharam Telugu Daily