Saturday, 19 September 2026 03:03:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ మండల కమిటీ డిమాండ్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 September 2026 07:50 PM Views : 46

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ములకలపల్లి /సెప్టెంబర్ 18 /అక్షరం న్యూస్: కేంద్రం విధించిన యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేసి మరింత సరళంగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేటట్లు చూడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు,పోతుగంటి లక్ష్మణ్.మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్స్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీల పై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉపసమరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ములకలపల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ప్రధాన సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించి ఆందోళన చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు,మండల కార్యదర్శి పోతుగంటి లక్ష్మణ్,కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ.దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్సిటీ చెల్లింపులు ఎప్పట్లాగానే సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో,కేంద్రం అమెరికా ప్రయోజనాల కోసమే పన్నును పద్ధతిని తీసుకొచ్చిందని వారు ఆరోపించారు.సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయంటూ వాణిజ్య లావాదేవీల సైతం అతిశల్ప పరిణామం మాత్రమే పన్ను విదిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదని వారు అన్నారు.వాణిజ్య సంస్థలు ఈ పన్ను పోటును వినియోగదారుల నుండే ముక్కు పిండి వసూలు చేస్తారన్న విషయం కేంద్రానికి తెలియదా అని వారు ప్రశ్నించారు.ఈ చర్య వల్ల అన్ని రకాలుగా 30 వేల కోట్లకు పైగా దేశ ప్రజలపై భారం పడనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత టాక్స్ చెల్లిస్తున్న ప్రజలు అది ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా ప్రభుత్వ ధనాన్ని ఆస్తులని కార్పొరేట్ శక్తులకు రకరకాల పేరిట అప్పజెప్తున్న వైనాన్ని మరవద్దని ఈ సందర్భంగా వారు అన్నారు.బ్రిటిష్ వారు ఇండియాకు టీ కాపీలను ఉచితంగా అలవాటు చేసి లక్షల కోట్ల వ్యాపారం నేడు చేస్తున్నట్లు అమెరికా యూపీఐ లావాదేవీల కంపెనీలు 10 ఏళ్లు ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ అలవాటు అయిన తర్వాత ఇప్పుడు తొలిత వాణిజ్యానికి తర్వాత సామాన్యులపై ఈ పన్ను పోటు పెంచే ప్రమాదం ఉందని వారన్నారు.తక్షణమే ఆన్లైన్ లావాదేవీలపై కేంద్రం విధించిన పనులను ఎత్తివేసి మరింత సరళంగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేటట్లు చూడాలని వారు కోరారు. ఇప్పటికే మోడీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశానంటేయని అన్ని రకాల నిజ వేతనాలు పాతాళానికి పడిపోతున్న ఈ నేపథ్యంలో మరికొంత భారాన్ని వేయటమంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందమే నాని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే డిజిటల్ లావాదేవీల పై విధించిన పన్నును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘ డివిజన్ కార్యదర్శి నకిరేకంటి నాగేశ్వరరావు, కార్మిక సంఘ డివిజన్ కార్యదర్శి శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు, పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు నూపా సరోజిని,రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్ర గొర్ల రామారావు,నాయకురాలు కోర్సా ఆదిలక్ష్మి,మీడియం వసంత,వేలకం కన్నయ్య, సోడే అనురాధ,గుర్రం లక్మి,రవిచంద్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :